Thursday, May 16, 2024
- Advertisement -

డిప్రేషన్ లో రాజ్‌తరుణ్.. ఏం జరిగిందో తెలుసా..?

- Advertisement -

యంగ్ హీరోల్లో హీరో రాజ్ తరుణ్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయన ఇప్పుడు జోష్ గా కనిపిస్తుంటారు. కేవలం తన సినిమా పంక్షన్లలోనే కాకుండా ఇతర హీరోల పంక్షన్ లో కూడ రాజ్ తరుణ్ జాలీగా కనిపిస్తుంటారు. అలాంటి ఈ యంగ్ హీరో ఇప్పుడు విషాదంలో కూరుకుపోయాడ‌ట‌. ఎవరితోనూ మాట్లాడకుండా మూడీగా మారిపోయినట్లు తెలుస్తోంది. అందుకు కారణం.. ఆను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కల్లో ఒకటి చనిపోవడమేనని తెలిసింది.

ఈ యంగ్ హీరోకి కుక్కలంటే తెగ ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఎంతో ఖరీదుతో కొన్న కుక్కలనే కాకుండా కొన్ని వీధి కుక్కలను సైతం ఈ హీరో పెంచుతున్నాడు. వాటి చూసుకోవడం ప్రత్యేకంగా ఓ మనిషిని కూడా నియమించాడు. అయితే.. రెండ్రోజుల క్రితం ఆ కుక్కల్లో ఒక కుక్కపిల్లకు జబ్బు చేసింది. అది తెలుసుకున్న రాజ్.. వెంటనే దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి.. రెండు లక్షలు ఖర్చుపెట్టి మరి ఆపరేషన్ చేయించాడట. అయినప్పటికి ఆ కుక్క పిల్ల బతకలేదు.

దీంతో అతను విషాదంలో మునిగిపోయాడు. అతని ఫ్రెండ్స్ మాట్లాడేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. సరిగ్గా స్పందించడం లేదని, బయటకూడా పెద్దగా హుషారుగా కనిపించడం లేదని చెప్తున్నారు. ఫోన్ కూడా ఎత్తడం లేదని.. ఆ కుక్కపిల్లతో అనుబంధం గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి.. మనోడికి ఆ కుక్కపిల్లతో ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్ధం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -