Friday, May 17, 2024
- Advertisement -

నాలుగేళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి….

- Advertisement -

నాలుగేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా మార్టూరు పరిధిలోని గొట్టిపాటి హనుమంతరావునగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అందిన వివరాల్లోకి వెల్తే..గట్టిపాటి హనుమంతరావు నగర్ కి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు రోజూ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్తుంటాడు. ఆదివారం సాయంత్రం పదేహారేళ్ల బాలుడు చాక్లెట్ ఆశ చూపి ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

సోమవారం బాధిత చిన్నారి నొప్పితో బాధపడుతుంటే బంధువులు చిలకలూరి పేట ఆస్పత్రికి తీసుకువెళ్లారు.పరిశీలించిన వైద్యుడు లైంగిక దాడి జరిగినట్లు నిర్థారించారు. అయితే ఈ విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -