Friday, May 9, 2025
- Advertisement -

ఒక్క రోజులో సెల‌బ్రిటీగా మారిన మ‌హిళ‌..ఇంటర్వ్యూల కోసం వార్తా సంస్థలు పోటీ పడుతున్నాయి.

- Advertisement -

అన్నాచెల్లెల అనుబంధానికి ప్ర‌తీక‌గా జ‌రుపుకునే రాఖీ పండుగ .ఈ పండుగ‌కు కుల‌,మ‌తాలు లేవు. ప్రస్తుతం భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి, 23 ఏళ్ల నుంచి ఓ పాకిస్థానీ మహిళ క్రమం తప్పకుండా రాఖీ కడుతూ ఉందన్న సంగతి మీకు తెలుసా? అంటె చాలా మందికి తెలియ‌దు.

మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా ఉన్న సమయం నుంచే ఈ అన్నా చెల్లెళ్ల అనుబంధం మొదలు కాగా, ఈ సంవత్సరం కూడా తనకు రాఖీ కట్టేందుకు రావాలని మోదీ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. ఆమె పేరు ఖమార్ మొహసిన్ షేక్. ఓ భారతీయుడిని పెళ్లి చేసుకుని పాక్ నుంచి వచ్చి ఇండియాలో స్థిరపడింది. అప్పటి నుంచి ప్రతి యేటా నరేంద్ర మోదీని తన అన్నయ్యగా భావిస్తూ, రాఖీలు కడుతూ వచ్చింది.

ఇండియాలో తన తొలి రాఖీని ఆయనకే కట్టానని, అప్పటి నుంచి కడుతూనే ఉన్నానని, ఈ సంవత్సరం పని ఒత్తిడిలో ఆయన ఉంటారని భావించానని, కానీ, ఎంతో ఆశ్చర్యకరంగా తనకు మోదీ నుంచి సమాచారం వచ్చిందని, ఆనందంగా విషయాన్ని వెల్లడించారు మొహసిన్.

ఆయన్ను కలిసి రాఖీ కట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పారామె. ఇక మొహసిన్ కు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తుండటంతో ఆమె ఓ సెలబ్రిటీగా మారారు. ఆమెతో ఇంటర్వ్యూల కోసం వార్తా సంస్థలు పోటీ పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -