వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం సందర్భంగా ప్రమాదం సంభవించింది. జగన్ మండపేటకు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డు కిక్కిరిసి పోవడంతో పాటు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలపై భారీ సంఖ్యలో అభిమానులు నిలబడ్డారు. దీంతో ప్రజలు భవనాల పైకి ఎక్కారు. ఈ సమయంలో రోడ్డుపక్కన ఉన్న భవనం పిట్టగోడ కూలింది. ఈ ప్రమాదంలో భవనంపై నున్న 20 మంది గాయపడ్డారు. అదే సమయంలో భవనం కింద నిలబడిన మరో 10 మందికి కూడా దెబ్బలు తగిలాయి. గాయాలయిన వారిని మండపేట ఆస్పత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అవసరం అయితే మెరుగైన వైద్య చికిత్స చేయిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. గాయపడ్డ వారిని జగన్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు సూచించారు.
- Advertisement -
జగన్ బహిరంగ సభలో అపశ్రుతి…30మందికి గాయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -