Sunday, May 4, 2025
- Advertisement -

చారిత్రక సంతకానికి 5 ఏళ్లు

- Advertisement -

నేటితో ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా 5 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జగన్. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసిందని…ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందన్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందగా టీడీపీ 23, జనసేన 1 స్థానంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక 22 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ, 3 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -