కప్పలు సాదారనంగా చిన్న సౌజులో ఉంటాయి.మహా అంటె కొంచెం పెద్దసౌజులో ఉంటాయి.కాని ఓకప్ప మాత్రం ఇప్పుడు మీరు ఎప్పుడూ చూడని ఓ భారీ కప్ప పోటో సోషియల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.
కప్ప ఏంటి ఇంత వైరల్‌గా మారింది అనుకుంటున్నారా..?అకప్ప ప్రత్యేకతలేంటి అనుకుంటున్నారా..అయితే ఈ వివరాలు తెలుసు కోవాల్సిందే.
అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మార్కజ్ రాంజెల్ అనే వ్యక్తి చేపలు పట్టడానికి ఓ చెరువుకి వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో ఓ పెద్ద కప్పను పట్టాడు. ఈ కప్ప బరువు, పరిమాణం చాలా పెద్దవిగా ఉన్నాయి. దీని బరువు 5.8 కేజీలు ఉంది. పొడవు కూడా చాలా పెద్దదిగా ఉంది. ‘ది సౌత్ టెక్సాస్ హంటింగ్ అసోసియేషన్’ సభ్యులు ఈ కప్ప ఫోటోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఈ పోటో వైరల్‌గా మారడంతో నెటిజన్లు అశ్చర్యపోతున్నారు.ఇంత పెద్ద కప్ప ఎప్పుడూ చూడలేదని ..నమ్మలేక పోతున్నామని కామెంట్స్ పెడుతున్నారు.. ఇంతపెద్ద కప్పలు ఉండే అవకాశంలేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. దగ్గరి నుంచి ఫోటో తీయడంతో కప్ప చాలా పెద్దగా కనిపిస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. దీంతో మొత్తంగా 2 లక్షల 40 వేలమందిపైగా ఈ ఫోటోని షేర్ చేశారు.సోషియల్ పుణ్యమాని ఇప్పుడు ఎక్కడ ఏంజరిగినా అది సెకెన్లలో నెటిజన్ల ముందు ప్రత్యక్షమవుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}Zundh0y0nCM{/youtube}