భారత అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలంటే చెప్పాల్సిన పనిలేదు. ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి ఫిక్సయింది. ప్రముఖ వ్యాపారవేత్త రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం అంగరంగ వైభవంగా మార్చి 9న జరగనుంది. అయితే పెళ్లి కార్డు మాత్రం ఇప్పుడు వైరల్ అంవుతోంది. బోర్డ్ గేమ్ సైజ్‌లో ఉన్న ఆ వెడ్డింగ్ కార్డు అందర్నీ ఆకట్టుకుంటున్నది. బాక్సు ఆకారంలో ఉన్న పెళ్లి పత్రికపై రాధాకృష్ణులు ఉన్నారు. సిద్ధవినాయక ఆలయంలో ఈ వివాహ ఆహ్వాన పత్రికను ప్రదర్శించారు. అయితే ఒక్కో పెళ్లి కార్డు ఖరీదు 2.3 లక్షల రూపాయలు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకా ఇన్నర్ కంపార్ట్‌మెంట్‌ను తెరిస్తే, అప్పుడు పాపప్ వెడ్డింగ్ కార్డు కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్‌తో ఉండే వెడ్డింగ్ కార్డు.. అతిథులను పెళ్లికి ఆహ్వానిస్తుంది. దీవెనలను కూడా కోరుతూ అంబానీ దంపతులు ఓ నోట్ రాశారు. ఓ సూర్య దేవా.. మా ఆకాశ్‌లో నువ్వు వెలుతురువి, మాలో ప్రతి శ్లోకాన్ని జ్వలింప చేయాలని పెండ్లి ఆహ్వాన పత్రికలో రాశారు.
- Advertisement -
అదరహో అంటున్నా అకాష్ అంబాని వెడ్డింగ్ కార్డు…చూడాల్సిందే
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -