Saturday, May 10, 2025
- Advertisement -

చెల్లుకు చెల్లు.. అసెంబ్లీలో ఓ వ్యక్తి పిట్టకథ

- Advertisement -
Akbaruddin Owaisi Comments on KCR

కేసీఆర్ ను ఉద్దేశించి అసెంబ్లీలో అక్బరుద్దిన్ ఓవైసీ ఓ చిన్న పిట్టకథ చెప్పాడు..

ఒక సింగర్ నవాబ్ దగ్గర పాటలు పాడాడు..

నవాబ్ : వాహ్వ ! వీనికి ముత్యాలు ఇవ్వండి.

సింగర్ ఇంకా పాడాడు.

నవాబ్ : వీనికి మణులు మాణిక్యాలు ఇవ్వండి

సింగర్ ఇంకా పాడాడు.

నవాబ్ : వీనికి వజ్ర వైడుర్యాలు ఇవ్వండి.

సింగర్ ఇంకా పాడాడు.

నవాబ్ : వీనికి భూములు నజరానాగా ఇవ్వండి.

సింగర్ చాల సంతోష పడ్డాడు.

ఇంటికి వెళ్లి పెళ్ళాం బిడ్డలకు చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా చాల సంతోష పడ్డారు.

ఎన్ని రోజులైనా నవాబ్ గారు అవి పంపించలేదు.

ఆ సింగర్ అలా చాలా సేపు చూసి.. నవాబ్ దగ్గరకు వెళ్లి ” అయ్యా! మీరు ఇస్తామన్న ముత్యాలు, మణులు మాణిక్యాలు, భూములు వగైరా నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు.

అప్పుడు నవబ్ ఇలా సమాదనం ఇచ్చాడు. ఇందులో ఇచ్చి పుచ్చుకొనుడు ఏముంది. నువ్వు మా చెవులకు ఇంపుగా పాడినావ్. నేను నీ చెవులకు ఇంపుగా చెప్పినాను. చెల్లుకు చెల్లు. ఇంకా ఇచ్చేడిది ఏందీ.?

అలాగే కేసీఆర్ కూడా మీరందరూ నాకు వోట్లు వేసి నన్ను ఎంతో సంతోష పెట్టారు… అలానే మీకు బంగారు తెలంగాణా అని చెప్పి మిమ్మల్ని నేను ఎంతో సంతోష పెట్టాను. సో చెల్లుకు చెల్లు సరిపోయింది అని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -