రాజకీయాల్లో ఇప్పుడు అఖిలప్రియ ఓ సంచలనం అవుతున్నారు. ఆమె ఏం మాట్లాడిన ఏపీ రాజకీయాల్లో పెద్ద న్యూస్ అవుతుంది. అయితే తనకు పార్టీలో ఎవరితో అసలు విభేదాలు లేవని.. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తానని.. అందరితో కలుపుకొని వెళ్లేలా మాట్లాడుతానని.. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.
{loadmodule mod_custom,GA1}
అయితే నంద్యాలకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డితో.. తనకు గొడవలు ఉన్నాయని.. వచ్చిన వార్తల్లో అసలు వాస్తవం లేదని.. ఏవీ సుబ్బారెడ్డితో తనకు అసలు విభేదాలు రాలేదని మంత్రి తెలిపింది. ఇటివలే మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏవీ సుబ్బారెడ్డి మా నాన్న తర్వాత నాన్నంతటి ఆయన. ఆయనను నేను మామా అని పిస్తుంటాను. మా కుటుంబంతో ఆయనకు మంచి స్నేహాం ఉంది. అలాంటి ఆయనతో నాకు ఎందుకు విబేధాలు ఉంటాయి అని తెలిపింది. అంతే కాకుండా.. మా కుంటుంబంలో సభ్యుడు.. అలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకోను.
{loadmodule mod_custom,GA2}
ఏవైన సమస్యలుంటే ఆయనతో మాట్లాడి పరిష్కరించుకొంటాను. అంతే కానీ.. గొడవలకు పోను అని చెప్పింది. అలానే మా మధ్య ఉంటే తరాల అంతరం కొంత ఉండవచ్చేమోగానీ విభేదాలు మాత్రం అసలు లేవని.. ఉండవని స్పష్టం చేసింది. ఇక తనవైపు ఎలాంటి పొరపాట్లు ఉన్న వాటిని ఖచ్చితంగా సరిదిద్దుకోవాడానికి రెడీ అని చెప్పారు.
{youtube}gls7OBB2s6E{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related