Friday, March 29, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో లైక్‌ల‌కోసం కొడుకు ప్రాణాన్ని ప‌నంగా పెట్టిన తండ్రి….

- Advertisement -
Algerian dangled baby from window for Facebook likes, now he faces prison

ప్ర‌పంచంలో ఎక్క‌డ చూసినా సోషియ‌ల్ మీడియా రాజ్య‌మేలుతోంది.ఈసోషియ‌ల్‌మీడియా పిచ్చి ఎంత‌స్థాయికి చేరిందంటె హ‌త్య‌లు,హ‌త్యాచారాల‌నుకూడా లైవ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిన్నా – పెద్దా తేడా లేకుండా చాలా మంది సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

తమ పోస్ట్లకు ఎన్ని లైక్ లు – కామెంట్లు వచ్చాయి? ఎంత మంది షేర్ చేసుకున్నారు? తదితర అంశాలకు అధిక ప్రాధాన్యాన్నిస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

కొందరైతే ఫేస్ బుక్ లో లైక్స్ కోసం ఎంతటి వికృత చేష్టలకైనా పాల్పడుతున్నారు. ఈ లైక్స్ కోసం అల్జీరియాలోని ఓ తండ్రి ఏకంగా తన కన్న కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టాడు. తన బాబును 15వ అంతస్తు కిటికీలో నుంచి కిందకి పడేయబోతున్నట్టు ఫోటో తీశాడు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేసి 1000 లైక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే అలానే ఆ బాబును కింద పడేస్తానంటూ క్యాప్షన్ పెట్టాడు.

{loadmodule mod_custom,GA2}

ఆ కన్న తండ్రి పైశాచికత్వంపై నెటిజన్లు మండిపడ్డారు. వెంటనే అతడిని అరెస్టు చేయాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. ఆదివారం పోలీసులు అతడిని అరెస్టు చేసి అల్జీరియా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీనిపై సీరియస్ గా స్పందించిన కోర్టు వెంటనే అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఏఐ అరేబియా న్యూస్ సైట్ రిపోర్టుచేసింది.ఈ విషయాన్ని ఏఐ అరేబియా న్యూస్ సైట్ రిపోర్టుచేసింది..

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}t9efJgL-3xc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -