రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనుకున్నంతగా వానలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అనంతపురం జిల్లా. ఎప్పుడూ కరువు విలయతాండవం చేస్తోంది. అసలే అంతంతం వర్షపాతం. ఎటు చూసినా బీడు బూములు. విత్తనం వేసె పరిస్థితి అస్సలు లేదు.
రాష్ట్రంలో భారీగా వేరుశనగ పంట పండించేది అనంతపురం జిల్లానె. ఖరీఫ్ లో దాదాపు 6 లక్షల ఎకరాలలో వేరుశనగ వేస్తారు. అయితే, ఈ ఏడాది ఇప్పటి దాకా 1.3 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, విత్తనం వేసేందుకు ఉన్నగడువు జూలై 31న ముగిసింది. ఇక వేరు శనగ విత్తనం వేయలేరు. జూన్ నెలలో కురిసిన వర్షాలతో వేరు శనగ విత్తనం వేసిన రైతుల పరిస్థితి మరొక విధంగా ఉంది. జూన్ లో 60 వేల ఎకరాలలో వేరు శనగ వేశారు. అదంతా ఎండి పోతా ఉంది.
సోమవారం నాడు వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఒక సమీక్షా సమావేశంలో వాతావరణ శాఖ అధికారులు ఆగస్టు రెండో వారం దాకా వర్షాలు లేవన్నారు. జిల్లాలోని 26 మండలాల్లో 4 వేల ఎకరాలలో వేరశనగపంట బెట్ట దశలో ఉంది. జూన్ లో 59.2 మి.మీ వర్షపాతం నమోదయింది. జూలైలో కురిసింది కేవలం 20 మి.మీ మాత్రమే.
జిల్లా ఇన్ చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ జిల్లాలో పర్యటించి రెయిన్ గన్లొస్తాయి, పంటలను కాపాడతాయని చెప్పారు. గత ఏడాదేమో ముఖ్యమంత్రి భూగర్భ జలాలు పెరిగాయి, దీని తన ప్రభుత్వమే కారణమన్నారు. ఈ ఏడాది భూగర్భ జలాలు పడిపోయాయి. పండ్లతోటల రైతులు కూడా ఆందోళన చెందే పరిస్థితి వస్తున్నది. అసలు ఆయన రెయిన్ గన్ ను ప్రయోగాత్మక ప్రయోగించింది కూడా ఈ జిల్లా నుంచి. గన్ భూజనేసుకుని ముఖ్యమంత్రి ఎపుడొస్తారా అని జిల్లా రైతులంతా ఎదరుచూస్తున్నారు.
https://www.youtube.com/watch?v=WhlLT8vhxDM