Thursday, May 8, 2025
- Advertisement -

బాలికలదే పైచేయి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖమంత్రి గంటాశ్రీనివాసరావు ఈఫలితాలను విడుదలచేశారు. పదోతరగతి ఫలితాల్లో బాలురకంటే బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 17వేల 30మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 94.52 శాతం ఉత్తీర్ణలు అయ్యారు.

వీరిలో బాలురు 94.33 శాతం, బాలికలు 94.77 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో నూ వైఎస్ఆర్జిల్లా 98.89 శాతంతో మొదటి స్ధానంలో నిలవగా 90.11 శాతంతో చిత్తూరు జిల్లా చివరి స్ధానాన్నిదక్కించుకుంది.

అడ్వాన్స్సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 16 నుంచి నిర్వహిస్తామని మంత్రిగంటా శ్రీనివాసరావు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసంవత్సరం పదోతరగతి ఫలితాల్లోమూడుశాతం ఉత్తీర్ణతాశాతం పెరగడంవిశేషం. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -