Saturday, May 3, 2025
- Advertisement -

ఏపీలో చోటుచేసుకున్న మ‌రో దాచేపల్లి ఘటన…మైన‌ర్‌ బాలిక‌పై అత్యాచారం

- Advertisement -

ఏపీలో మైన‌ర్ బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాలు రోజు కొక‌టి వెలుగు చూస్తున్నాయి. నిన్న దాచేపల్లిలో అత్యాచార ఘటన మ‌రువ‌కు ముందే గుంటూరులో మ‌రో దారునం వెలుగు చేసింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో తాపీకూలీగా పని చేస్తున్న నాగూర్ మీరా అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెప్పిన వివరాలను బట్టి నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల కిందట ఇదే గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ చిన్నారిపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -