Friday, April 26, 2024
- Advertisement -

మళ్లీ లాక్‌డౌన్ అవ‌స‌రముండదు: ఏపీ హోం మంత్రి

- Advertisement -

దేశంలోని వివిధ రాష్ట్రాల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం చాప‌కింద నీరులా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే క‌రోనా వైర‌స్ కొత్త కేసుల న‌మోదైన విద్యా సంస్థ‌లు, పాఠ‌శాల‌లు, కాలేజీల‌ను తాత్కాలికంగా మూసివేయాల‌ని రాష్ట్ర మంత్రి అదిమూల‌పు సురేష్ తెలిపారు.

అలాగే, క‌రోనా విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే విద్యాసంస్థ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా ఆయ‌న హెచ్చరించారు. తాజాగా క‌రోనాపై రాష్ట్ర హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత కీల‌క వ్యాఖ్యలు చేశారు. గ‌తేడాది రాష్ట్రంలో క‌రోనా కేసులు న‌మోదైనప్పుడు దానికి స‌రైన విధానం లేక‌పోవ‌డంతోనే లాక్‌డౌన్ పెట్టాల్సి వ‌చ్చింద‌నీ, ప్ర‌స్తుతం వైర‌స్ టీకా అందుబాటులోకి రావ‌డంతో మ‌ళ్లీ లాక్‌డౌన్ అవ‌స‌రం లేద‌నే అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

ఇక రాష్ట్రంలో క‌రోనా ప్ర‌భావంపై సుచ‌రిత స్పందిస్తూ.. ఏపీలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌న్నారు. ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నీ, క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని పేర్కొన్నారు. అలాగే, క‌రోనా టీకా తీసుకునేందుకు ప్ర‌జ‌లు ముందుకు రావాల‌నీ, వ్యాక్సిన్ల‌పై వ‌స్తున్న దుష్ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌లకు తెలిపారు. కాగా, 2020లో మాస్కులు లేకుండా బయటకు వచ్చిన 80 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు వెల్ల‌డించారు.

తెలంగాణలో ‘బ‌హిరంగ’ ఆంక్ష‌లు

ఈ సింపుల్ చిట్కాలతో విద్యుత్ బిల్లులు తగ్గించుకోండి !

టీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇలా…

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఆయ‌న ఐదు బెస్ట్ సినిమాలు ఇవిగో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -