టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ తమిళ హీరో విజయ్‌కు వ్యక్తిగత జీవితంలో మరో షాక్ తగిలింది. ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమ విడాకుల కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ కేసు పూర్తయ్యే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని సంగీత కోర్టును కోరింది. చెన్నైలోని నీలంగరై ప్రాంతంలో ఉన్న విజయ్ నివాసంలో తనకు కూడా హక్కు ఉందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
సంగీత వాదన ప్రకారం, ఆ ఇంటిపై తనకు సగం వాటా ఉందని, అందువల్ల విడాకుల కేసు ముగిసే వరకు అక్కడే నివసించేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ అంశంపై కోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విజయ్–సంగీతల మధ్య వివాహ బంధం దెబ్బతిన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత చేసిన తాజా పిటిషన్ తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీవీకే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబ విషయాలు బయటకు రావడం మరింత చర్చకు దారి తీస్తోంది.
సంగీత పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారం విజయ్ వ్యక్తిగత జీవితంతో పాటు రాజకీయ ప్రస్థానంపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
