- Advertisement -
తెలంగాణలోని ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. నీరు లేక భవిష్యత్ లో అనేక ఇబ్బందులు తప్పవని, దీనిని అధిగమించాలంటే ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
డిజిపి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత అనురాగ్ శర్మ ప్రారంభించారు. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ వారానికి ఒకసారి స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించాలని, దీని వల్ల పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన పెరుగుతుందన్నారు. డిజిపి కార్యాలయంలో అత్యంత శుభ్రత పాటిస్తున్న సి సెక్షన్ కు డిజిపి రెండు వేల రూపాయల ప్రోత్సాహక బహుమతి అందజేశారు.