ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ మరో సారి తడబడ్డాడు. మూడేళ్లు మంత్రిగా పనిచేసిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షరాజకీయాల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అందునా సీఎం కొడుకు కాబట్టి ఓడి పోతె పరువుపోతుంది. మంగళగిరి అభ్యర్ధిగా లోకేష్‌ను ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. అయితే బహిరంగ సభల్లో తప్పులు మాట్లాడటం నెటిజన్లు ఒ ఆట ఆడుసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా గురువారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. అక్కడున్న నేతలు ఒక్కసారి అవాక్కయ్యారు. ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కనే ఉన్న తెలుగు దేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేశ్ కవర్ చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు.
- Advertisement -
మరో సారి పప్పులో కాలేసిన లోకేష్…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -