ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గందరగోళం జరుగుతోంది. ఓ పక్క చంద్రబాబు నాయుడు.. మరో వైపు వైస్ జగన్.. మరో వైపు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఎవరిది గెలుపో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వైసిపి సభ్యులు అసెంబ్లీ లో తమకు అవకాశం ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఈ మధ్య ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ లో గందరగోళం ఏర్పడుతోంది.
అసెంబ్లీ మొదలు అయిన కొద్దిసేపట్టికే వాయిదా వేస్తున్నారు. అసెంబ్లీ సమవేశాల్లో వైసిపి సభ్యులు మాట్లాడే చాన్స్ ఇవ్వడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. ప్రతిపక్షలకు అసలు అవకాశం లేకుండా పోయింది. మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడం.. అక్కడితో వారి మాటలకు ఆపేయడం వంటివి చేస్తున్నారు. సమస్యల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడకుండా చేస్తే.. ఎందుకు ఈ అసెంబ్లీ సమవేశాలు పెట్టడం అని వైసిపి సభ్యులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు.. వైస్ జగన్ మాట్లాడుతుతున్న సమయంలో కూడా మైక్ కట్ చేయడం తో వైసిపి ఎమ్మెల్యేలు.. చంద్రబాబు ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం మంచిది కాదని.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇదే విషయం పై ప్రజలు కూడా ఆశ్చర్యనికి లోనవుతున్నారు.
ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం పక్కన పెడితే.. ఇలా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న ప్రజలు మాత్రం వాపోతున్నారు.