Friday, May 10, 2024
- Advertisement -

వామ్మో.. బాబు కోసం కొన్న లగ్జరీ వాహనాలు 36

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విభజనానంతర ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఇంకా ఏడాది కూడా కాలేదు కానీ.. ఆయన ముఖ్యమంత్రిగా సాధిస్తున్న రికార్డులు మాత్రం వామ్మోఅనిపిస్తున్నాయి.

ఏ అభివృద్ది విషయంలోనో.. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలోనో ఇలాంటి రికార్డులు సృష్టించి ఉండుంటే… ఏదో అనుకోవచ్చు కానీ, బాబు  ప్రభుత్వం సొమ్మును వాడేసుకోవడంలో డాబు, దర్పాలు  కనబరచడంలో ఈ రికార్డులను సృష్టిస్తుండటమే విడ్డూరం!
ఇప్పటి వరకూ బాబు కోసం కొన్న లగ్జరీ వాహనాల సంఖ్య 36 అని తెలుస్తోంది. వీటిలో 35 వాహనాలు కాన్వాయ్ లో తిరిగే ఫార్చూనర్లు. సఫారీలు కాగా.. ఒకటి హెవీ బస్సు! తాజాగా కొన్న ఈ బస్సు విలువ దాదాపు ఆరు కోట్ల రూపాయలు అని టాక్. బాబు ఎప్పుడైనా ఎక్కడికైనా బస్సులో వెళ్లాల్సి వస్తే  దీన్ని ఉపయోగిస్తారట!
ఇప్పటి వరకూ బాబుకు మొత్తం మూడు కాన్వాయ్ లున్నాయి. హైదరాబాద్ లో ఒక కాన్వాయ్.. విజయవాడలో ఒకటి.. తిరుపతిలో ఒకటి ఇవి రయ్ రయ్ మంటున్నాయి. ఏ ముఖ్యమంత్రికి అయినా ఒక కాన్వాయ్ మాత్రమే ఉంటుంది. బాబుకు మాత్రం మూడు నగరాల్లో మూడు కాన్వాయ్ లున్నాయి. అదేంటి అంటే.. అవసరం అంటున్నారు. ఇప్పుడు ఒక బస్సు తో కాన్వాయ్ లోని వాహనాల సంఖ్య 36 కు చేరింది! మొత్తానికి ఇలా ఉంది బాబు వైభవం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -