Tuesday, May 6, 2025
- Advertisement -

పేదరిక నిర్మూలనే జగన్ లక్ష్యం..

- Advertisement -

నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్..జగన్ సర్కార్ చేసిన ప్రగతిని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయన్నారు.విద్యా, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నామని తెలిపిన గవర్న్…ఇవాళ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. ఇప్పటివవరకు విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఏపీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందుతోందని వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం అమలు చేస్తామన్నారు.

విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్నిఆవిష్కరించామని తెలిపారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటివరకూ 53. 53 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చామని ఇందుకోసం రూ. 33, 300 కోట్లు వెచ్చించామన్నారు. మిచౌంగ్ తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం అందించామని చెప్పారు. ఏపీలో 55, 607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తోందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -