Saturday, May 3, 2025
- Advertisement -

కొత్త లిక్కర్ పాలసీ..అధ్యయనం కోసం 6 రాష్ట్రాలకు!

- Advertisement -

ఏపీలో కొత్త లిక్కర్ పాలసీని తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు. మద్యం పాలసీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసేందుకు 4 బందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ నాలుగు బృందాలు 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది. ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులు ఉన్నారు.

ఈ నెల 12లోగా నివేదికలు సమర్పించాలని 4 అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నివేదిక ఆధారంగా అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి రానుంది. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 4 బృందాలు వెళ్లనుండగా ఆయా రాష్ట్రాల్లో ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్ లు, ధరలు, మద్యం కొనుగోళ్లతో పాటు నాణ్యం, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై పూర్తి వివరాలను సేకరించనున్నాయి.

అలాగే ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు కౌలు, పెన్షన్ మరో ఐదేళ్లు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం అని చెప్పుకొచ్చారు. గతంలో లాగానే 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు.సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -