Wednesday, May 7, 2025
- Advertisement -

బాబుగారితో వేగలేము అంటున్న ఏపీ ఉద్యోగులు .. రెండుగా చీలిపోయారు

- Advertisement -
AP secretariat employees on biometric

నవ్యాంధ్ర కేంద్రంగా పరిపాలన సాగించాలి అనే ఉద్దేశ్యం తో వెలగపూడి లో తాత్కాలిక సెక్రెటరియట్ ని నిర్మించి మరీ ముందుకు సాగుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సాక్షాత్తూ సొంత రాష్ట్రం ఉద్యోగులే బాబుగారికి చుక్కలు చూపిస్తున్నారు. ఉద్యోగుల హాజరు – పనితీరు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలుచేస్తోంది. వెలగపూడికి తాత్కాలిక సచివాలయం తరలివెళ్లిన తర్వాత అక్కడ కూడా ఈ విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ మేరకు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని – జీఏడీ ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పటివరకూ కేవలం 40 శాతం మంది ఉద్యోగులే బయోమెట్రిక్ కోసం వేలిముద్రలు ఇచ్చినట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.వెలగపూడి సమీపంలో ఉండేందుకు సరైన వసతులు లేవని తాము మంగళగిరి-గుంటూరు నుంచి రావడంతో ఆలస్యం అవుతుందోని ఒక్కోసారి సీఎం సెక్యూరిటీ వల్ల కూడా వెలగపూడికి వచ్చేందుకు ఆలస్యమవుతోందంటూ రకరకాల కారణాలు తెరపైకి తీసుకువస్తున్న ఉద్యోగుల సాకులపై విస్మయం వ్యక్తమవుతోంది.

 అయితే ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకూ ఇలాంటి సమస్యలే కొంచెం అటు ఇటుగా ఉన్నాయని మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు ఉద్యోగులు భార్యాపిల్లలను విడిచిపెట్టి వేరొక చోట ఉద్యోగాలు చేస్తున్నారని ముఖ్యంగా టీచర్లు – రెవిన్యూ – ఆరోగ్యశాఖ సిబ్బంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తూ ఏళ్లపాటు కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయాన్ని మరికొందరు వారు గుర్తు చేస్తున్నారు. అయితే తమకెవరికీ లేని మినహాయింపులు సచివాలయ ఉద్యోగులకే ఎందుకన్న ప్రశ్న తాజాగా తెరపైకొచ్చింది. అలాగైతే అన్ని ప్రభుత్వ శాఖలనూ ఈ విధానం నుంచి మినహాయించాలని వారికి అమలుచేసినప్పుడే తమకూ అమలుచేయాలన్న వాదన మొదలవడంతో బయోమెట్రిక్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండుగా విడిపోయినట్టయింది.ఈ విషయంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులంటే భయపడుతున్నట్లు కనిపిస్తోందని వారితో ఘర్షణ పెట్టుకోవడం వల్ల రాజకీయంగా నష్టపోతామన్న ధోరణితోనే మెతక వైఖరి ప్రదర్శిస్తున్నట్లు ఉపాధ్యాయ – రెవిన్యూ – వైద్య ఆరోగ్యశాఖ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -