అధికారులతో సమీక్షా సమేవేశాల వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా బాబు శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించడం తీవ్ర కలకం రేపింది. సమీక్షకు హజరయిన అధికారులు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. మరో వైపు సీఎస్ కూడా అధికారులు ఎవరూ సమీక్షలకు హజరు కావద్దని ఆదేశాలు జారీ చేయడంతో దానిపై మంత్రి సోమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయనకు సంబంధించిన శాఖలపై సమీక్ష నిర్వహిస్తానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అవసరం అయితే సుప్రీంకోర్టులకు వెల్తానని సవాల్ చేశారు.
శాఖలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి సచివాలయం వెల్లిన సోమిరెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు.కరవు, అకాల వర్షాలపై సమీక్ష చేయాలని నిర్ణయించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… ఇందుకు సంబంధించి ఈ నెల 24నే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అందుకు తగ్గట్టుగానె కరవు, అకాల వర్షాలపై సమీక్ష చేయాలని నిర్ణయించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… ఇందుకు సంబంధించి ఈ నెల 24నే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆగ్రహంగా చేసేదేమి లేక అక్కడనుంచి వెల్లిపోయారు.సమీక్షలు చేయోద్దంటూ సిఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సోమిరెడ్డి ముందుగా ప్రకటించనట్టుగానే ఆయన దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది.