జీతాలు పెంచాలంటూ ఆందోళన చేస్తోన్న వలంటీర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చారు. వలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడమే అని స్పష్టం చేశారు. దీంతో తమ పొరపాటు ను తెలుసుకున్న వలంటీర్లు దిగి వచ్చారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని.. కొంతమంది వ్యక్తుల ప్రలోభాల వలన కొందరు వలంటీర్లు అలా ప్రవర్తించారని తెలిపారు. ఈ సందర్భంగా వలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ…
‘ఆ రోజు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు మేము వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. వలంటీర్లు అందరి తరుపున సీఎం జగన్ గారికి క్షమాపణలు చెబుతున్నాం. సీఎం జగన్ మాకు రాసిన లేఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. లేఖ ద్వారా ఆయన మాకు క్లారీటీ ఇచ్చారు. గతంలో ప్రతి రోజు ఆఫీసుకి రావాలి.. లేదంటే జీతాలు కట్ అవుతాయని అని చెప్పేవారు.
ఇప్పుడు మా విధివిధానాలు తెలుసుకున్నాం. వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే సేవ చేయ్యండని చెప్పిన సీఎం జగన్‌కి థాంక్స్. ప్రజలకు సేవ అనే దృక్పథంతో ఉన్న సీఎంని స్ఫూర్తిగా తీసుకుని సేవ చేస్తున్నాం. సీఎం జగన్‌కి ఎప్పుడూ మేము వ్యతిరేకం కాదు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేస్తాం’ అని వలంటీర్లు పేర్కొన్నారు.
Also Read
ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అనేటట్లుగా తీర్పు ఇచ్చారు..!
ఇప్పుడు షర్మిల వచ్చింది… రేపు జూనియర్ ఎన్టీఆర్..!
టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా
డైరెక్టర్ కాకముందు సుకుమార్ జీతం తెలిస్తే షాక్?