Saturday, April 27, 2024
- Advertisement -

డైరెక్టర్ కాకముందు సుకుమార్ జీతం తెలిస్తే షాక్?

- Advertisement -

దర్శకుడు సుకుమార్ ఎంత ప్రతిభ గల దర్శకుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకడిగా దూసుకుపోతున్నాడు.తన సినిమాలు యూత్ కి ఎంత బాగా కనెక్ట్ అవుతాయో చెప్పనవసరం లేదు.ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు సినిమా తీయడం ఆయన స్పెషాలిటీ.

ఇక సినిమా డైరెక్టర్ కాకముందు లెక్కల మాస్టర్ గా పని చేసిన సుకుమార్ అప్పట్లో ఎంత జీతం తీసుకున్నాడు అని తాజాగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..ఇక బుచ్చిబాబు మాట్లాడుతూ…”ఇంటర్ కాలేజ్ లో నేను సుకుమార్ గారితో సైకిల్ పై సినిమాకు కూడా వెళ్ళేవాళ్ళం.

ఎప్పుడైనా సినిమాకు వెళతాము అంటే క్లాస్ విన్న తరువాతే వెళ్ళాలి అనేవాళ్ళు. అప్పుడప్పుడు 50రూపాయలు కూడా ఇచ్చేవారు. 50 రూపాయలు అంటే అప్పట్లో చాలా ఎక్కువ. ఇక 1997-98 ఆ మధ్యలో సుకుమార్ గారి జీతం 70వేల వరకు ఉండేది. మా ఏరియాలో అప్పుడు అత్యధికంగా ఒక ఎకరా ధరనే 50 వేలు ఉండేది.

ఆ రేంజ్ లో జీతం అందుకున్న సుకుమార్ గారు వివి.వినాయక్ దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి నెలకు 500రూపాయలు అందుకున్నారు”.. అని బుచ్చిబాబు తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ రేంజ్ చూసుకున్నట్లయితే సుకుమార్ పుష్ప సినిమాకు 10కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడట.

కర్మాగారానికి గనులు కేటాయించాలని డిమాండ్ చేయడం విచిత్రం..!

ఆసక్తి రేపుతున్న దిల్ రాజు నాట్యం టీజర్..!

భాగ్యనగరంలో కజికిస్థాన్ అడ్డా..మంచికే..!

ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అనేటట్లుగా తీర్పు ఇచ్చారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -