- Advertisement -
96 ఏళ్ల వయస్సు…
ఆల్మోస్ట్ వీల్ చెయిర్ లోనే జీవితం…
ఎయిర్ ఫోర్స్ లో ఫైవ్ స్టార్ ర్యాంక్ కొట్టిన ఏకైన వ్యక్తి…
అతడు పేరు అర్జున్ సింగ్ .
ఎంతో కష్టంతో పాలం విమానాశ్రయానికి వచ్చాడు.
అతని దృష్టిలో ఉన్న ఏకైక ఎయిమ్ కూడా అదే అన్నట్లుగా …. చివరి సెల్యూట్ కొట్టి కలాంకు నివాళ్లు అర్పించాడు.
బహుశ … కలాం గొప్పతనాన్ని,సాంకేతికంగా ఇండియా ఎదుగుదలకు కారకుడైన కలాం ప్రాముఖ్యాన్ని అతను ఎంతో నిశితంగా గమనించి ఉంటాడు కాబోలు.చివరిసారిగా అతను కొట్టిన సెల్యూట్ తో అక్కడున్నవారంతా ఎలా ఫీలయ్యారో తెలియదుగాని … అర్జున్ సింగ్ కు తన జీవితం ధన్యమైపోయినంతగా ఆనంద పడ్డాడు.ఆ సెల్యూట్ లో ఉన్న కిక్ ఏంటో దేశభక్తులకు మాత్రమే తెలుస్తోంది.
