Saturday, May 10, 2025
- Advertisement -

ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డ్స్..ఫీచర్లివే

- Advertisement -

ఏపీ సీఎం జగన్ ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ్టి నుండి ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుండగా సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. నేటినుండి ప్రారంభంకానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు జగన్.

కొత్తగా రూపొందించిన హెల్త్ కార్డ్ లో లబ్దిదారుని పేరు. ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబసభ్యులు వివరాలు ఉండనున్నాయి. అలాగే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద సేకరించిన లబ్దిదారుడి ఆరోగ్య వివరాలకు సంబంధించిన ఐడీ కూడా వుంటుంది.

ప్రతి కార్డుపై ఓ క్యూఆర్ కోడ్ , ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే సదరు కార్డు హోల్డర్ ఆరోగ్య వివరాలన్ని తెలియనున్నాయి. కార్డు హోల్డర్ చేయించుకునే వైద్య పరీక్షలు, ఏయే వ్యాధులు కలిగివున్నారు, ఏ చికిత్స పొందారు, డాక్టర్ సిపార్సులు ఇలా సమస్త సమాచారం క్యూఆర్ కోడ్ తో లాగిన్‌తో తెలియనుంది.

నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కేవలం ప్రభుత్వ దవాఖానాల్లోనే కాదు కార్పోరేట్ హాస్పిటల్స్ లో కూడా ఉచితంగానే వైద్యాన్ని పొందేలా ఆరోగ్యశ్రీని రూపొందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -