Sunday, May 4, 2025
- Advertisement -

మోదీ సర్కారుకు సవాల్ విసిరారు!

- Advertisement -

కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు యుద్ధం ప్రకటించారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఇటాలియన్ కోర్టు నిందితులుగా పేర్కొన్న సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేతలను దమ్ముంటే అరెస్ట్ చేయాలని ఆయన మోదీ సర్కారుకు సవాల్ విసిరారు.

ఈ కేసులో తాను నిందితుడిగా ఉండి ఉంటే… ఇప్పటికే అరెస్ట్ అయి ఉండేవాడినని పేర్కొన్న కేజ్రీ… సోనియాను మాత్రం టచ్ చేయడానికే బీజేపీ సర్కారు జంకుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేటి ఉదయం ట్విట్టర్ వేదికగా ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్… ఈ కేసుతో నరేంద్ర మోదీ సర్కారుకు, సోనియా గాంధీ కుటుంబానికి లోపాయికారి ఒప్పందం వెలుగుచూస్తోందని కూడా ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -