కాస్తంత తేడా కూడా రాకుండా ఉండాలి అనీ ఒకవేళ తేడా ఒస్తే ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డికి ఇప్పుడు బాగా అర్ధం అయినట్టు ఉంది. ఊహించిని విధంగా రేవంత్ బాలకృష్ణ నుంచి షాక్ ఎదురు కొన్నారు. తాను నటించిన వందవ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కి సంబంధించి ఒక స్పెషల్ షో కెసిఆర్ కోసం వేస్తూ ఉండగా దానికి ఆయన్ని ఆహ్వానించడం కోసం బాలయ్య అసంబ్లీ కి వెళ్ళారు.
బాలకృష్ణ వస్తున్న సమాచారాన్ని అందుకున్న టీడీపీ నేతలు తెరాస పక్ష నేతలూ ఆయనకి స్వాగతం పలికారు. కారి దిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఎదురు వెళ్లి ఆయనకీ ఆహ్వానం అందించారు. ‘వెల్ కం టూ తెలంగాణ అసెంబ్లీ’ అని ఆహ్వానించారు. దీనికి స్పందించిన బాలకృష్ణ.. తాను కళాకారుడినని.. తనకు రాష్ట్రాలతో సంబంధం లేదని.. వేరు చేసి మాట్లాడటం సరికాదంటూ తనదైన ధోరణిలో చెప్పుకొచ్చారు. ఊహించని రీతిలో పంచ్ పడేసరికి రేవంత్ కాస్త ఇబ్బందికి గురి కావాల్సి వచ్చింది.
అదే సమయంలో టీఆర్ ఎస్ నేతలు సైతం బాలకృష్ణకు పింక్ కలర్ గులాబీల బొకే ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బాలకృష్ణకు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ఆసక్తిని ప్రదర్శించటం గమనార్హం. అనంతరం ఆయన తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లారు.