Friday, May 9, 2025
- Advertisement -

బాలయ్యకు సిఎం పదవి ఇవ్వాలి!

- Advertisement -

ఓటుకు నోటు కేసులో ఇంకా చంద్రబాబు కు ఏసిబి నోటీసులే ఇవ్వలేదు. కానీ ప్రతి పక్షాలు మాటల్ని తూటాల్లా పేలుస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటుకు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేసి బాలయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన సూచించారు.

చంద్రబాబు 1995 నుంచి 2015 వరకు ఇలాంటి సంస్కృతిని అవలంభిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాలయ్యకు సిఎం పదవి ఇవ్వటం వల్ల ఎన్‌టి రామారావు గారి ఆత్మ శాంతిస్తుందని, చంద్రబాబు రాజకీయం గతంలో వైశ్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను కొని ఎన్‌టిఆర్ ను దించినపుడే చంద్రబాబు నైజం బయటపడిందన్నారు. అప్పుడు అండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఉన్నారని ఆయన మీడియాకు తెలిపారు.

చంద్రబాబుకు ఏసిబి నోటీసులు రాక మునుపే ఇలా ఉందంటే ఇక నోటిసులు వస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి.  

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -