Saturday, April 27, 2024
- Advertisement -

గిన్నీస్ బుక్ లో బతుకమ్మ

- Advertisement -

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన మహా బతుకమ్మ గిన్నీస్ బుక్ లో స్థానం దక్కించుకుంది. 9292 మంది ఆడ‌ప‌డుచుల‌తో బతుకమ్మ ఆడారు.9వేల 292 మంది మహిళలు బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు.12 నిమిషాలపాటు ఆగకుండా బతుకమ్మ ఆట, పాట పాడారు.

జోరు వర్షంలోనూ మహిళలు బతుకమ్మ సంబురంలో పాల్గొన్నారు. 20 అడుగుల ఎత్తు, 35 అడుగుల చుట్టు కొలతలో బతుకమ్మ పేర్చారు. మొదటి వరసల్లో 20 మంది.. చివరి వరసలో వెయ్యి మంది మహిళలు బతుకమ్మ ఆడారు.

ప్రతి వరసలో బతుకు కష్టసుఖాల విశిష్టతను వివరించే శృతిలయల ఆటపాటలతో స్టేడియం మార్మోగింది. కేరళలో ఒకే రోజు 5వేల 211 మంది మహిళలు ఓనమ్ పండుగ చేసుకున్నారు. ఓనమ్ రికార్డ్ ను బద్దలుకొట్టి.. మహాబతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -