Thursday, May 8, 2025
- Advertisement -

చంద్రబాబు జైలుకి వెళ్తాడా? లక్షకు రెండు లక్షలు!

- Advertisement -

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం ఇప్పడు చాలా ఆసక్తికరంగా మారింది. ఆంద్ర ప్రదేశ్‌లో రాజకీయ పెను మర్పులు వస్తాయి అని తెలంగాణ మంత్రులు, రాజకీయ విశ్లేషకులు పదే పదే అంటున్నా అవి ఏమో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు  ఐపిఎల్ తర్వాత బెట్టింగ్ పరంపర మళ్ళీ మొదలైంది. అది ఏంటంటే చంద్రబాబు జైలుకి వెళ్తాడా? వెళ్ళడా? అనే దాని పైన భారీ గా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడా? ఉండడా? అనే అంశంలో కూడా బెట్టింగ్‌లు భారీగా జరుగుతున్నాయి.

మొదటినుంచి బెట్ట్ంగులకు మారు పేరైన ఆంద్ర ప్రదేశ్‌లో బెట్టింగ్ రాయుళ్ళకు రేవంత్ రెడ్డి వ్యవహారం పండగ తెచ్చి పెట్టింది. 

ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. మొత్తం వ్యవహారం టీవీ లలో రావటంతో బెట్టింగ్ కి ఎవరి సొంత నిర్ణయాలు వారు తీసుకొని జోరుగా బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలిసింది. జైలుకు వెళ్తాడని బెట్టింగ్ పెడితే లక్షకు రెండు లక్షలు… అదే రీతిలో వెళ్ళడని పెట్టినా లక్షకు రెండు లక్షలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల చంద్రబాబు మాట్లాడిన తీరును కూడా బెట్టింగ్ సమయంలో చర్చించుకుని పందేలు వేస్తున్నట్లు తెలిసింది.    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -