Thursday, May 2, 2024
- Advertisement -

బిగ్‌బాస్ సీజ‌న్ -2 హోస్ట్‌గా న‌లుగురు టాప్ హీరోల‌లో ఎవ‌రు…?

- Advertisement -

తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో సీష‌జ‌న్ -2కు రంగం సిద్ద‌మ‌వుతోంది. బిగ్‌బాష్ సీజ‌న్ 1 బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. తెలుగు టీవీ ప్రేక్షకులకు కూడా ఇలాంటి షోలు బాగానే కిక్ నిస్తాయని ఫస్ట్ ఎడిషన్తో స్పష్టం అయ్యింది. తొలిసారితో పోలిస్తే రెండో సారి మరింత భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేయడానికి దీని రూపకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి రెండో ఎడిషన్ కు ఎన్టీఆర్ హోస్టుగా వ్వ‌వ్యవహరిస్తాడా? లేదా? అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేని అంశం.

ఎన్టీఆర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొనే ఇదే సమయంలో.. ఇతర హీరోల కోసం కూడా ట్రై చేస్తున్నారు. పారితోషకం, జనాల్లో క్రేజ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ప్ర‌స్తుతం అల్లు అర్జున్, నాని, దగ్గుబాటి రాణా లతో కూడా బిగ్ బాస్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరో ఒకరితో రెండో ఎడిషన్ ను చేయించాలని అనుకుంటున్నారట.

అయితే.. ఈ హీరోలు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. వీళ్లలో ఎన్టీఆర్, రాణాలు బుల్లితెరపై తమ సత్తా చాటారు. ఇక నాని, అల్లు అర్జున్ లు రాణించగలరు. ఎవరైనా ప్రోగ్రామ్ హిట్టే.. అయితే పారితోషకాల దగ్గరే చర్చలు జరుగుతున్నట్టుగా టాక్. మ‌రి చివురకు బిగ్‌బాస్ సీజ‌న్‌-2కు హోస్ట్‌గా ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -