Wednesday, May 7, 2025
- Advertisement -

కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స

- Advertisement -

బాలీవుడ్ లో ప్రముఖ హాస్యనటుడు రజాక్ ఖాన్ కన్నుమూసారు. ఈయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఈయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాస తీసుకోవడం కష్టమై బుధవారం మధ్యాహ్నం ఆయన మరణించారు.

బాలీవుడ్ లో దాదాపు 90 చిత్రాల్లో నటించిన రజాక్ ఖాన్  మంచి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాద్ షా, హలో బ్రదర్, హసీనా మాన్ జాయేగి, జోరు కా గులామ్ వంటి సినిమాలతో రజాక్ ఖాన్ పాపులర్ అయ్యారు. ఈ అకాల మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రముఖ నటులు రజాక్ ఖాన్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -