వరంగల్ గ్రామీణ జిల్లా పరిధిలోని ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు కొట్టుకుపోయారు. ఈత రాకపోవడం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరిని స్థానికులు కాపాడారు. ఇంకొకరు కాల్వలో గల్లంతయ్యారు. పర్వతగిరి మండలం కొంకపాక వద్ద ఈ ఘటన జరిగింది.
కళ్లముందే నలుగురు కాల్వలో కొట్టుకుపోతుంటే ఏం చేయలేని స్థితిలో స్థానికులున్నారు. కొందరు సాహసం చేసి కొట్టుకుపోతున్న వారిలో ఒకరిని కాపాడగలిగారు. మరో ఇద్దరు కళ్లముందే నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. రెండు మృతదేహాలు స్థానికులు వెలికితీశారు. గల్లంతైన మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఓ మహిళ గుంటూరుపల్లిలో ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. ప్రమాదస్థలిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు.
సాగర్ లో సీఎం కేసిఆర్ షెడ్యూల్ ఇదే..!
ప్రలోభాలకు దూరంగా ఉండండి.. వలంటీర్లకు వైఎస్ జగన్ లేఖ