Tuesday, April 30, 2024
- Advertisement -

బగారు ఆకుతో ఎన్నో ప్రయోజనాలు!

- Advertisement -

నిత్యం మనం తినే ఆహార పదార్థాలు ముఖ్యంగా మూలికలకు సంబంధించి..ఆకులకు సంబంధించిన వాటిలో ఎన్నో ఔషదాలు దాగిఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని ఆకుల్లో అద్భుతమైన ఔషదాలు ఉన్నాయి. సాధారణంగా మనం తినే ఆకు కూరల్లో కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర, గోంగూర, పాలకూర, బచ్చలకూర వీటితో ఎంతో మంచి ఆరోగ్యం. బిర్యానీ ఆకు కొన్ని చోట్ల బగారు  దీన్నే ఇంగ్లీష్ లో  బే లీఫ్ అని హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు. ఆ ఆకు వేయగానే చుట్టు పక్కల వారికి అద్భుతమైన సువాసన వస్తుంది.

ఆకు కేవలం వంటల్లోనే కాకుండా ఇంట్లో ఎలాంది దుర్గంధం వస్తున్నా దాన్ని నుంచి ఉపశమనం పొందడానికి బిర్యానీ ఆకు కాల్చి రూమ్ తలుపులు మూసి వేయాలి. 10 నిమిషాల వరకు ఉంచి తర్వాత ఆ ఇంట్లోకి వెళ్తే చ‌క్కని వాస‌న వ‌స్తుంది. దోమ‌ల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి. అంతే కాదు ఇలా చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న అంతా మటుమాయం అవుతుంది.  బిర్యానీ ఆకుల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది.

ఇది మెరుగైన కంటిచూపుకి స‌హాయ‌ప‌డుతుంది. కాబ‌ట్టి విట‌మిన్ ఎ లోపంతో బాధ‌ప‌డేవాళ్లు బిర్యానీ ఆకుల‌ను ఒక పూట ఆహారంలో చేర్చుకుంటే.. ఎలాంటి కంటిచూపు స‌మ‌స్య‌లు ఉండ‌వు. మధుమేహం నియంత్రణలో ఉండడానికి బిరియానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకు పొడిని ఉదయం సాయంత్రం నీటిలో కలిపి తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి.

ఇవి చ‌ర్మ ఆరోగ్యానికి స‌హ‌క‌రిస్తుంది. అలాగే ఊపిరితిత్తులు, నోటి క్యాన్స‌ర్ తో ఇది స‌మ‌ర్థ‌వంతంగా పోరాడుతుంది.బిర్యానీ ఆకులో విట‌మిన్ బి, పాంటోధెనిక్ ఆమ్లం, ఫైరాడిక్సిన్, రైబో ఫ్లేవిన్ అధికంగా ల‌భిస్తాయి. శ‌రీరంలోని ఎంజైముల ప‌నితీరుని ఇవి మెరుగుప‌రుస్తాయి. నాడీవ్య‌వ‌స్థ ప‌నితీరు, జీవ‌క్రియ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డంలో బిర్యానీ ఆకు స‌హాయ‌ప‌డుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -