Thursday, May 8, 2025
- Advertisement -

త‌మిళులకు శుభ‌వార్త‌: కావేరి బోర్డు ఏర్పాటులో ముందడుగు

- Advertisement -

కావేరీ జలాల విషయంపై తమిళనాడులో తీవ్ర ఆందోళనలు కొన‌గుతున్నాయి. కావేరీ జలాల్లో కర్ణాటకకే ఎక్కువ శాతం నీరు కేటాయించిన నేపథ్యంలో త‌మిళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయ‌కులు, రైతులు నిరసనలు చేస్తున్నారు. వీరి ఆందోళ‌న‌ల‌పై సోమ‌వారం సుప్రీంకోర్టు స్పందించింది. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాలనే తమిళనాడు ప్ర‌జ‌లు డిమాండ్‌పై సుప్రీంకోర్టు జీవం పోసింది. ఈ విష‌యమై సోమ‌వారం సుప్రీంకోర్టు స్పందించి కేంద్రానికి ప‌లు ఆదేశాలు జారీ చేసింది.

కావేరీ జ‌లాల మేనేజ్‌మెంట్‌ బోర్డు విషయం ముందే తమను ఎందుకు సంప్రదించలేదని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కావేరీ బోర్డు ఏర్పాటు అంశంపై కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మే 3వ తేదీలోగా కావేరి బోర్డు ముసాయిదాను అందించాలని కోర్టు చెప్పింది. ఆ బోర్డు ఏర్పాట‌య్యేంత దాక తమిళనాడు, కర్ణాటక ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -