Wednesday, May 7, 2025
- Advertisement -

జ‌గ‌న్‌పై మ‌రో అద‌న‌పు ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన సీబీఐ ..

- Advertisement -

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. అక్ర‌మాస్తుల కేసులో ఇప్ప‌టికే ఆరోప‌న‌ల‌ను ఎదుర్కొంటున్న జ‌గ‌న్ ప్ర‌తీ శుక్ర‌వారం సీబీఐ కోర్టుకు హాజ‌ర‌వుతున్నారు. జ‌గ‌న్‌పై ఉన్న 11 చార్జిషీట్లకు అదనంగా కొత్తగా మరో చార్జిషీటు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఇది జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా పెద్ద దెబ్బే. ఇక అధికార‌పార్టీనాయ‌కుల‌కు జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి మ‌రో కొత్త ఆయుధం చేతికి చిక్కినట్లైంది.

జగన్ కంపెనీల్లో ఇందుటెక్ జోన్ పెట్టుబడులపై వచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు చార్జిషీటుకు అనుమతించింది. ఇందులో ప్రధాన నిందుతులైన జగన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐ. శ్యాంప్రసాద్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య, డి. పార్ధసారధిరావు, ఆడిటర్ సీవీ కోటేశ్వర్రావులకు కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే 16వ తేదీన నిందుతులు, ఆయా సంస్ధల ప్రతినిధులు స్వయంగా కోర్టుకు హాజరవ్వాలంటూ కోర్టు ఆదేశించింది.

జగన్ కంపెనీల్లోకి ఇందుటెక్ పెట్టుబడులపై సిబిఐ సమర్పించిన చార్జిషీట్ ఆధారంగా ఈడీ కూడా విచారణ మొదలుపెట్టింది. మనీల్యాండరింగ్ నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఈ పెట్టుబడులు వచ్చినట్లు ఈడీ నిర్ధారించింది. ఇందూ కంపెనీకి అర్హతలు లేకపోయినా రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి 250 ఎకరాలు కేటాయింపు జరిగిందన్న ప్ర‌ధాన‌ఆరోపణ.

అందులోనుండి శ్యాంప్రసాద్ రెడ్డి కొడుకు దమాకర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న ఎస్వీఆర్ ప్రాపర్టీస్ కు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. అందుకు ప్రతిఫలంగా జగతి పబ్లికేషన్లో రూ. 50 కోట్లు, కార్మెల్ ఏషియాలో రూ. 20 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఈడి చెబుతోంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. తాజాగా జ‌గ‌న్‌పై మ‌రో అద‌ర‌పు ఛార్జీషీట్ దాఖ‌లు కావ‌డం జ‌గ‌న్‌కు మైన‌స్సేన‌ని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -