Sunday, May 11, 2025
- Advertisement -

IAS లు మందు తాగేవారూ ఒకటేనా చంద్రబాబు గారూ ? కాస్త అలోచించి మాట్లాడండి !

- Advertisement -
Chandrababu Naidu Fires on IAS Officials

పోలిక తో మాట్లాడడం , వారినీ వీరినీ కంపేర్ చేస్తూ మాట్లాడ్డం చాలా ఇబ్బందికర విషయం. ఎవరి స్టైల్ , ఎవరి లెక్క, ఎవరి పరిస్థితి వారిది అయిన తరుణంలో ఒకరిని ఒకరితో కంపేర్ చేస్తూ మాట్లాడడం చాలా చిరాకు తెప్పించే అంశం. ఆ విషయాన్ని తెలుసుకోలేరో మరి తెలిసినా మర్చిపోతారో కానీ తెలుగు రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదో చెప్పబోయి ఇంకేదో చెప్పి బుక్ అయ్యారట.

ఆ మధ్య ఎవరూ ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకోరు.. మురికివాడల్లో పుడితే మురికి ఆలోచనలే వస్తాయి? లాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన చంద్రబాబు.. తాజాగా సంబంధం లేని పోలికలతో మరోసారి టంగ్ స్లిప్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.మొన్న జరిగిన ఒక సమావేశం లో నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తున్న వారు చేతులు ఎత్తాలని అడిగారు. మొత్తం అధికారుల్లో 20 శాతం మంది అధికారులు మాత్రమే చేతులు ఎత్తటం చూసిన చంద్రబాబు.. ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు పెద్ద రచ్చగా మారాయి. మీ కంటే మందుబాబులే బెటర్.. చేతిలో క్యాష్ లేకుంటే కార్డులు వాడేస్తున్నారు. కార్డులు వాడకుంటే సాయంత్రానికి కిక్కు ఎక్కదు.. అందుకు క్యాష్ లెస్ లావాదేవీలు జరుపుతున్నారు.. ఆన్ లైన్.. స్వైపింగ్ కు అలవాటు పడుతున్నారు.. మీరు కూడా మైండ్ సెట్ మార్చుకోవాలి.. మీరే నగదురహిత లావాదేవీలు చేయకుంటే ప్రజలకేం చెబుతారు? అంటూ వ్యాఖ్యానించటంపై ఐఏఎస్ అధికారులు గుస్సా అవుతున్నారు. వారిని మందు బాబులతో పోల్చడం ఏంటి అంటున్నారు ? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -