రాజకీయాలలో ఎప్పుడూ ఏదీ సీరియస్ గా ఉండకూడదు కదా అప్పుడప్పుడూ కామెడీ పొట్లం కూడా తెరిచి తింటూ ఉండాలి. మన నేతలు కామెడీ విషయం లో తక్కువేమీ కాదు. దేశ వ్యాప్తంగా కామెడీ చేసేవారు తగ్గినా తెలుగుదేశం లో వారు రోజు రోజుకీ పెరుగుతున్నారి. 2016 సీజన్ ఎందింగ్ లో భారీ కామెడీ పండింది.
తెలుగుదేశం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కి ఈ ఏడాది బెస్ట్ పొలిటికల్ కమీడియన్ అవార్డు దక్కింది. లాలూ ప్రసాద్ యాదవ్ మాంచి ఫోర్సులో ఉన్నకాలంలో.. అంటే ఆయన బీహార్ సీఎంగా ఉన్న రోజులు ఆ తరువాత జైలు నుంచి వచ్చాక – మళ్లీ కేంద్రంలో రైల్వే మంత్రి అయ్యాక కూడా రాజకీయాల్లో కామెడీ బాగా ఉండేది. ఆయన చేష్టలతో పాటు సెటైరిక్ డైలాగులూ అలరించేవి. కానీ… చాలాకాలంగా లాలూ పంచ్ లు తగ్గిపోయాయి. అలాగే దేవగౌడ ప్రధానిగా ఉన్న కాలంలో తన నిద్రతో నవ్వించేవారు.
మన్మోహన్ సింగ్ కాలంలో ఆయన మౌనంపై మిగతావారు పేల్చే పంచ్ డైలాగులు నవ్వు తెప్పించేవి. ఇక తెలుగు నేలపై పెద్ద నేతలు కామెడీ చేయడం బాగా తక్కువ. రోశయ్య యాక్టివ్ గా ఉన్న కాలంలో సెటైర్లు వేసి నవ్వించేవారు. కానీ… తెలుగు దేశం పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్ చాలావరకు కామెడీ చేసేవారు. సినిమా నటుడైన ఆయన తరచూ పార్లమెంటులో నిరసన తెలపడానికి వివిధ వేషాలు వేసి నవ్వు తెప్పిస్తుంటారు. అంతకుముందు కర్నూలు మేయర్గా పనిచేసిన బంగి అనంతయ్య కూడా ఇలాంటి వేషాలతో గతంలో నవ్వులు పూయించేవారు. కానీ… ప్రస్తుతం మాత్రం కామెడీ పండించే నేతలు కరువైపోయారు.
అయితే… చాలాకాలంగా రాజకీయాలను వెంటాడుతున్న కామెడీ లోటును భర్తీ చేసేలా రీసెంటుగా ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సూపర్ కామెడీ చేశారు. బీకాంలో తాను ఫిజిక్సు – మ్యాథ్స్ చదువుకున్నాని చెప్పడంతో సోషల్ మీడియాలో ఒకటే సెటైర్లు. మూణ్నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే సందడి.
అయితే… ఈ కామెడీ అంతా ఎలా ఉన్నా ఈ ఇష్యూతో చంద్రబాబు కూడా తెగ సంతోషిస్తున్నారట. ఫిరాయింపు సమయంలో మంత్రి పదవిపై ఒప్పందం చేసుకున్న జలీల్ ఖాన్ కు ఈ సాకుతో మంత్రి పదవి ఎగ్గొట్టొచ్చని చంద్రబాబు ఆనందిస్తున్నారట. జలీల్ ఖాన్ మాత్రం పరువుతో పాటు పదవి కూడా పోయిందంటూ ఇంటి నుంచి బయటకు రావడం లేదట.