ఇంతకాలం బాబు చేతిలో ఉన్న మీడియాను ఎల్లో మీడియా అన్నారు. వాటిలో ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాలున్నాయి.ఐతే అతి త్వరలో తనకున్న ఎల్లో మీడియాలోకి వెబ్ మీడియా కూడా వచ్చి చేరనుంది. దీన్ని ఎల్లో వెబ్ మీడియా గా మనం ట్రీట్ చేయవచ్చు.అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా చిక్కినంత ఇదిగా బాబుకు వెబ్ మీడియా చిక్కుతుందని అనుకోవడానికి వీల్లేదు.ఎందుకంటే ఓ టీవీ ఛానల్ తమకు అనుకూలంగా వార్తలు రాయడం లేదని ఏదో వంక పెట్టి ప్రసారాలు రాకుండా నొక్కేస్తున్నారు.
కాని వెబ్ మీడియా కంట్రోల్ లోకల్ గా మనవారి చేతిలో ఉండదు.సో దాన్ని మ్యానేజ్ చేయడం చాలా కష్టం.ఇది తెలిసిన బాబు ఎంతో తెలివిగా 2019 ఎలక్షన్స్ టైమ్ కు తనని తాను మరింత స్ట్రాంగ్ గా తయారు చేసుకోవడం కోసం వెబ్ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం సరికొత్త వ్యూహాలు పన్నుతున్నాడట.దానిలో భాగంగా ప్రస్తుతం మార్కెట్లో లీడింగ్లో ఉన్న కొన్ని వెబ్ న్యూస్ పోర్టల్స్ ప్రతినిధులను బాబు అనుచరగణం సంప్రదించినట్లు తెలుస్తోంది.వారిలో కొందరు వీరి దారికొచ్చినా ….ఇంకొందరు దారికొచ్చేలా కనిపించడం లేదు.దీంతో బాబు బ్యాచ్ తలలు పట్టుకున్నారు.అసలే సోషల్ మీడియాలో బాబుకంటే జగనే చాలా స్పీడ్ గా ఉన్నాడు.జగన్ కు సంబందించిన ప్రతి పోస్ట్ కు రెస్పాన్స్ సూపర్బ్ గా వచ్చేస్తోంది.మరి అదే రీతిలో తనకు రావాలంటే విశ్లేషణలు చేసే రచయితలను లేదా ఆయా సంస్థల బాస్ లను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందుకే రేటు ఎక్కువైనా సరే ఎల్లో బ్యాచ్ లో కొందరు బాబుకు ప్రతికూలంగా వార్తలు రాసే తోపు వెబ్ సైట్ లను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు.భవిష్యత్ లో ఈ సైట్ల రేట్లు ఎలాగూ భారీగా పెరుగుతాయి కాబట్టి…వీళ్లు రేటు ఎక్కువైనా సరే వెనకాడకుండా కొన్నింటిని కొనేసారు.ఇక తమకు అనుకూలంగా లేని సైట్ల విషయంలో ఎవరెవరు ఆయా సంస్థలకు ఆర్టికల్స్ రాస్తోరో వారిని లేదంటే ఆ సదరు వెబ్ సైట్లకు 3rd పార్టీ ప్రైవేట్ యాడ్ లు తెచ్చే వారిని పట్టుకుని తమకు అనుకూలంగా రాయమని నయానో భయానో ఎంతో కొంత సమర్పించుకుని తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకున్నట్లు ‘ఆద్యా న్యూస్’ కు స్పష్టమైన ఆధారాలు లభించాయి.సో ఇక నుంచి జగన్ దూకుడుకు అటు వెబ్ మీడియానుంచి కూడా చెక్ పడనుంది.ఆవిధంగా బాబులు పెత్తనం చేస్తున్నారు మరి.
–సూర్యమ్ కలిదిండి