Thursday, May 8, 2025
- Advertisement -

సుప్రీంలోనూ బాబుకు తప్పని నిరీక్షణ..

- Advertisement -

చంద్రబాబు ఎప్పుడు విడుదల అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఫైబర్ నెట్ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ వాయిదాల మీద వాయిదా పడుతోంది. ఏపీ హైకోర్టు బాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీంపైనే ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇక ఇవాళ బాబు క్వాష్ పిటిషన్‌ ను విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ చంద్రబాబు విడుదలకు సంబంధించి గుడ్ న్యూస్ వింటామని భావించిన టీడీపీ నేతలు, లోకేష్‌కు నిరాశ తప్పలేదు. మంగళవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు సంబంధించిన మిగిలిన వాదనలు వింటామని తెలిపింది. ఇవాళ సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు.

ఇక చంద్రబాబుకు ఇవాళ రిలీఫ్ దక్కిన విషయం ఏంటంటే ఒక అంగళ్లు కేసులో మాత్రం ముందస్తు బెయిల్ దక్కింది. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు కూడలి వద్ద చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగం చేయడంతో అల్లర్లు జరిగాయి. దీంతో చంద్రబాబుపై హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతేగాదు ఏ1గా చంద్రబాబును చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బాబుకు రూ. లక్ష పూచీకత్తుతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

మరోవైపు ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతుండగా దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు టీడీపీ నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -