Thursday, May 8, 2025
- Advertisement -

‘వాట్సప్’ లో తెలుగుదేశం పరువు పోతోంది..!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ను కదిలిస్తే చాలు.. తన వల్లనే దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందింది. .చెందుతోంది.. అని అంటారు. సామాన్యుడి చేతికి సెల్ ఫోన్ వచ్చినా.. ప్రతి ఇంట్లోనూ  కంప్యూటర్ కొలువైనా అది తన ఘనతనే అని ప్రచారం చేసుకొంటూ ఉంటారు. ఈ మాటల్లో లాజిక్ లేకపోయినా బాబు గారు వెనక్కు తగ్గరు.. అనేది తెలిసిన విషయమే.

మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన సాంకేతికరంగం ద్వారానే తెలుగుదేశం పార్టీ పరువు పోతోంది.. . విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ల లోని వాట్సప్ ద్వారా తెలుగుదేశం పార్టీ పరువు పోతోంది!

ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సంభాషణలు వాట్సప్ ద్వారా ప్రచారంలోకి వచ్చాయి. మొదటగా మీడియాకు అందుబాటులోకి వచ్చిన ఈ ఆడియోఫైల్ ఇప్పుడు వాట్సప్ లోకి ఎక్కింది. బాబు గారు స్టీఫెన్ సన్ తో మాట్లాడటం.. తాము అండగా నిలుస్తామని హామీ ఇవ్వడం.. తో కూడిన ఈ సంభాషణ వాట్సప్ లో ఒకరి నుంచి మరొకరికి షేర్ అవుతోంది. 

మరి బాబు గారి తీరు ప్రజాస్వామ్యానికి పాతర వేయడమే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రభావితం చేయాలని చూడటం దారుణాతి దారుణమే. మాటెత్తితే తాను నీతిమంతుడిని అని.. అవతలి వారు తన ఎమ్మెల్యేలను పశువులను చేసుకొని కొనుక్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యేల కొనుగోలు చేసే వ్యవహారం లో భాగస్వామి అయ్యాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆడియోఫైల్స్ వాట్సప్ లో షేర్ అయిపోతున్నాయి. మరి ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం ఎలా రిసీవ్ చేసుకొంటుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -