పార్టీలో సీనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోవాల‌ని సూచ‌న‌….

Chandrababu Series Warning to Akhila Priya

కొన్నాల్లుగా నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్తి విష‌యంలో నాయ‌కులు,ప్ర‌జ‌ల‌లోఉన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.ఎట్ట‌కేల‌కు ఇరు పార్టీలు త‌మ అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించారు.వైసీపీనుంచి శిల్పా,బూమా వ‌ర్గంనుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిపేర్ల‌ను ప్ర‌క‌టించి ఎన్నిక స‌మ‌రానికి సిద్ద‌మ‌య్యారు.

నంద్యాల‌లో టీడీపీ బ‌లంగా ఉంద‌ని నాయ‌కులు చెప్తున్నా ….క్షేత్ర‌స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంద‌నే స‌మాచారం బాబుకు తెలిసింది.ఎన్నిక గెలుపుపై ఆందోళ‌న చెందిన బాబు…శిల్పాక్యాడ‌ర్‌,జ‌గ‌న్‌కు ఉన్న స‌పోర్టును చూసి గెల‌పుపై అనుమానం వ్య‌క్తం చేశారంట‌.అందుకే అఖిల ప్రియ‌కు సిరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

{loadmodule mod_custom,GA1}

అఖిల డిమాండ్ చేసిన‌ట్లు వారి కుటుంబానికే టికెట్టు ఇచ్చారు.శిల్పాలాంటి నాయ‌కున్ని వ‌దులుకున్నా. ఈ ఎన్నిక‌లు ఎంతో ప్ర‌తీస్టాత్మ‌క‌మ‌న ఎన్నిక‌లు.తేడా వ‌స్తే నాప‌రువుతో పాటు పార్టీ ప‌రువు పోతుంద‌ని గుర్తుపెట్టుకోని అఖిల‌కు సూచించారంట‌.
ఇప్పుడు గెల‌వ‌కుంటె 2019 ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మ‌నే భావ‌న‌ను బాబు వ్య‌క్తం చేశారంట‌.పార్టీలో సీనియ‌ర్‌ల‌ను క‌లుపుకొని పోవాల‌ని గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారంట‌.ఉప ఎన్నిక‌వ‌ర‌కు ఇంఛార్జ్‌లుగా ప‌నిచేస్తున్న వారినుంచి పిర్యాదులు వ‌స్తే బాగుండ‌ద‌ని అఖిల‌కు సూచించారంట బాబు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}04zibTFZ0mU{/youtube}