Tuesday, May 14, 2024
- Advertisement -

బాలయ్యను అలా సంతృప్తి పరిచిన చంద్రబాబు…!

- Advertisement -

అసలే బాలయ్య.. అందులోనూ ఎమ్మెల్యే.. మరి అలాంటి ఆయనకు కోపం తెప్పిస్తే ఇంకేమైనా ఉందా? ఈ విషయంలోబాలయ్య ప్రతిపక్షాలనే లెక్కచేయడు. అలాంటిది సొంత పార్టీ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురయితే ఆయన సహిస్తాడా?

మరి ఈ విషయంపై తెలుగుదేశం అధినేతకు కూడా క్లారిటీ ఉండనే ఉండవచ్చు. బాలయ్యకు ఈ విషయంలో ఎలాంటి కోపం రాకుండా చూసుకోవాలని ఆయన భావించి ఉండవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ తమ అంతర్గతంగా ఎమ్మెల్యేలకు ఇచ్చుకొన్న ర్యాంకింగ్స్ లో నందమూరి నటసింహానికి మంచి ర్యాంకే దక్కిందట!

 

బాలయ్య రాష్ట్రస్థాయిలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఒకడిగా నిలిచాడట.వందమందికిపై గా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో పనితీరు విషయంలో బాలయ్య టాప్ టెన్ లో ఒకరు. ఇక అనంతపురం జిల్లాలెవల్లో అయితే బాలయ్యకు తగిలే టీడీపీ ఎమ్మెల్యేనే లేకపోయాడట! అనంతలో అయితే టాప్ ర్యాంక్ బాలయ్యదేనట. ఇదీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తరపు నుంచి బాలయ్యకు దక్కిన గౌరవం. 

 

మరి నిజంగానే బాలయ్య అంతలా చించేశాడా? ఎమ్మెల్యేగా అంతగా రాణిస్తున్నాడా? మిగతా ఎమ్మెల్యేల కన్నా బాగా పనిచేస్తున్నాడా? అనే సందేహాలు ఎవరికైనా వస్తాయి. మరి ఈ విషయం గురించి కాస్తంత విచారిస్తే.. బాలయ్య సంగతి బాబుకు తెలుసు అని.. బాలయ్యకు ఎక్కడ కోపం వస్తుందో అనే భయంతోనే ఆయన నందమూరి నటసింహానికి టాప్ ర్యాంక్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. మరి అసలు కథ ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -