ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర్నుంచీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా… చంద్రబాబు, కేసీఆర్ మధ్య ప్రతి విషయంలో పోటీ వస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాల్లో కూడా ఇద్దరి మధ్యా ఆధిపత్య పోటీ నడుస్తోంది. బీజేపీకి మిత్రపక్షంగా కాస్త అడ్వాంటేజ్ తీసుకుంటున్న చంద్రబాబుదే ఈ ఇష్యూలో.. కాస్త ముందంజలో కనిపిస్తోంది.
ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ఏపీలో కలిపేలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రప్పించగలగడం నుంచి… తాజాగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. ఒక్క ఏపీకే లక్షా 93 వేల ఇళ్లను ఇప్పించుకోగలగడం వరకూ.. చంద్రబాబు డామినేషన్ స్పష్టంగా ఏర్పడుతోంది.
కానీ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంతో పాటు.. చాలా విషయాల్లో రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులను రప్పించలేకపోయారు. ఓ వైపు తమకు కనీసం రాజధాని కూడా లేదని.. చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెబుతూ… చంద్రబాబు కేంద్రం నుంచి వీలైనంతగా సహాయం పొంది అక్కడి జనం దృష్టిలో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ.. రాజకీయ వైరంతో బీజేపీకి కాస్త దూరంగా ఉంటున్న కేసీఆర్ మాత్రం.. ఆ స్థాయిలో కేంద్రం నుంచి సహాయాన్ని పొందలేకపోతున్నారు.
అప్పుడప్పుడూ కేంద్రంతో దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తున్న కేసీఆర్… ఆ రిలేషన్ ను తెలంగాణకు.. కేంద్రం సహాయం రూపంలో మలచలేకపోతున్నారు. అందుకే.. చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్టు సాగుతున్న పోటీలో.. ఓ అడుగు బాబే ముందు ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. ఏపీకి కేంద్రం దాదాపు 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిన విషయాన్ని ఇందుకు ఓ ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ విషయాలను టీఆర్ఎస్ నేతలు ఎంత వరకు గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ.. జనం మాత్రం బాగానే చర్చించుకుంటున్నారు.