దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది కరోనా వ్యాక్సిన్ లేకపోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ మహమ్మారి భారి పడి ప్రాణాలు వదిలాారు. ఇక కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పలువురు సెలబ్రెటీలు కరోనా టీకాలు తీసుకుంటున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు గుంటూరులోని భారత్‌పేటలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ వార్డు, గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం మూడు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

ఇందు కోసం గ్రామాల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేసే విషయంపై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వివరించారు. ప్రజలకు ఏయే రోజు వ్యాక్సిన్ వేస్తారు? ఎప్పుడు వెళ్లాలనే అంశాలను వివరించి చెబుతారని అన్నారు.
రజినీకాంత్ కి ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్!