Friday, March 29, 2024
- Advertisement -

రజినీకాంత్ కి ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్!

- Advertisement -

భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన స్టైల్ యాక్షన్ కి చిన్నా, పెద్ద అందరూ ఫిదా అయ్యేవారే.. తాజాగా అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2021కి గాను ర‌జ‌నీకాంత్ అందుకోనున్నారు.  ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం. రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు” అని ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు.

మొట్టమొదటి సారిగా 1969 లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు. రజనీకాంత్ ఈ అవార్డు పొందిన 12 వ దక్షిణ భారతీయుడు.

1969 నుండి ఈ అవార్డుల‌ని ప్ర‌క‌టిస్తుండ‌గా, ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పుర‌స్కారాన్ని అందుకోగా, ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్. బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు.

త్రిపురలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -