సీఎం జగన్ జూన్ 1న ఉదయం 5 గంటలకు తాడేపల్లి గూడెంకు చేరుకోనున్నారు. 15 రోజుల విదేశీ పర్యటన ముగించుకోనున్న జగన్… గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
కౌంటింగ్ ఏర్పాట్ల గురించి, గత 15 రోజుల నుంచి రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి చర్చించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ వివాదం, పోలింగ్ తర్వాత అనంతపురం, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కౌంటింగ్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అన్నదానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసింది వైసీపీ. జగన్ ఒక్కరే మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. మే 13న పోలింగ్ ముగిశాక జగన్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు. కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించారు.