తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలలో జరిగిన ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. తమిళనాట అధికార అన్నాడిఎంకె పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ జయకేతనం ఎగురవేస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక పుదుచ్చేరిలో డిఎంకె , కాంగ్రెస్ పార్టీ కూటమికి మెజారిటీ స్దానాలు దక్కే అవకాశం ఉంది.
కేరళలో కూడా వామపక్ష కూటమిదే గెలుపు. ఎన్నాళ‌్ల నుంచో ఈసాన్య రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న బిజెపికి ఆ కల అస్సోంలో తీరనుంది.తమిళనాడులో మొత్తం 234 స్ధానాలు ఉంటే జయలలిత పార్టీ అన్నాడిఎంకె కు 90 నుంచి వంద స్ధానాలు దక్కనున్నాయి. ఇక్కడ డిఎంకె, కాంగ్రెస్ కూటమికి 132 నుంచి 140 స్ధానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది.
అయితే సీ ఓటర్ సర్వే మాత్రం జయలలితకు 138 స్దానాలు వస్తాయని పేర్కొంది. ఇక్కడ 118 స్ధానాలు వచ్చిన పార్టీ ఆదికారాన్ని కైవసం చేసుకుంటుంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీపైనే బెంగాల్ ఓటర్లు మొగ్గుచూపారు. ఇక్కడ మమతా బెనర్జీ పార్టీకి 160 నుంచి 220 స్ధానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సిపిఎం పార్టీ కాంగ్రెస్ తో జత కలిసినా లాభం కలిగేలా కనిపించడం లేదు.